హుజూర్‌నగర్ : హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణానికి పాత అలైన్‌మెంటే సరైనదని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు ముఖ ద్వారంగా ఉండి దినదినాభివృద్ధి చెందుతున్న కోదాడ, సూర్యాపేట పట్టణాలకు హైస్పీడ్ రైల్వే మార్గం ఎంతో అవసరం అని అన్నారు. గత అలైన్‌మెంట్‌లో ఉన్న సూర్యాపేట కోదాడ మీదుగా జగ్గయ్యపేట రైల్వే లైన్ సరైనది పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు, శ్రీనివాస్, మల్లేశ్వరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


