కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఆగమాగం

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

మునగాల, చిలుకూరు : కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలోని రైతులు ఆగమాగం అవుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం మునగాల మండలంలోని నేలమర్రి, చిలుకూరు మండల కేంద్రంలో రైతుల పంట పొలాలను పరిశీలించారు. రైతులు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు ముందుగానే హెచ్చరించినప్పటీకీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాగర్‌ డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నా ఆరుతడి పంటలకు నీళ్లు ఇచ్చారని, నేడు సాగర్‌ నీటి విడుదలపై నేటి వరకు స్పష్ట్రమైన ప్రకటన కూడ చేయడం లేదని అన్నారు. దాంతో సాగుపై రైతుల్లో గందరగోళం నెలకొన్నదని ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగు నీటి విడుదలపై సరైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ మునగాల మండల అధ్యక్షుడు తొగరు రమేష్‌, నాయకులు కందిబండ సత్యనారాయణ, కోల ఉపేందర్‌, నర్రా ఇంద్రశేఖర్‌రెడ్డి, గోపిరెడ్డి నాగిరెడ్డి, నర్రా వెంకటరెడ్డి, చిలుకూరులో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అక్కినపల్లి జానకిరామాచారి, ఉప సర్పంచ్‌ బెల్లంకొండ నాగయ్య, చిలుకూరు ఫ్యాక్స్‌ చైర్మన్‌ అలసకాని జనార్దన్‌, నాయకులు బెల్లంకొండ సైదులు, తాళ్లూరి శ్రీను, అంబాల వెంకటి, మేకపోతుల శ్రీను పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement