నేతన్నకు నిజమైన నేస్తం వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

నేతన్నకు నిజమైన నేస్తం వైఎస్‌ జగన్‌

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

ధర్మవరం: చేనేత కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు, నేతన్నలకు నిజమైన నేస్తం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. అందుకే చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి ‘నేతన్న నేస్తం’ పేరుతో ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.25 వేలు ఇస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయకుండా మోసం చేస్తోందని, ఈ విషయాన్ని చేనేత కార్మికులకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జ్‌లపైనే ఉందన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... ప్రతిఒక్కరూ జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. చేనేతలకు మంచి జరగాలంటే మళ్లీ వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. ఇందుకోసం అందరం కష్టపడదామని పిలుపునిచ్చారు. గతంలో నేతన్న నేస్తం అందుకున్న కార్మికులను చైతన్య పరిచి ఈనెల 20వ తేదీన ప్యాదిండి ఆంజనేయస్వామి ఆలయం నుంచి భారీ బైకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. చేనేత కార్మికులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

చేనేత కార్మికులకు అండగా

20న భారీ బైకు ర్యాలీ

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌

కరపత్రాల విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement