మద్యం తాగి వాహనం నడిపిన యువకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

మద్యం తాగి వాహనం నడిపిన యువకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

పెనుకొండ: మద్యం సేవించి వాహనం నడిపిన యువకుడి లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు... సీఐ రాఘవన్‌ ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి పెనుకొండ పట్టణ శివార్లలో ఇటీవల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఆల్విన్‌ కాలనీకి చెందిన ఎ.వెంకటేష్‌ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. ఇందులో భాగంగానే వెంకటేష్‌కు రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే మూడు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఏ మాత్రం ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపడతామని ఎస్‌ఐ తెలిపారు.

గోరంట్లలో ఇద్దరికి జరిమానా

గోరంట్ల: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి పెనుకొండ కోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. వివరాలు... గోరంట్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇటీవల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓడీ చెరువు మండలానికి చెందిన బండి అనిల్‌, పుట్టపర్తికి చెందిన సాయికుమార్‌ నాయక్‌ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రూ.20 వేలు జరిమానా విధించారు. అలాగే ఇద్దరి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు మూడు నెలల పాటు రద్దు చేసినట్లు ఆర్టీఓ కరుణాసాగర్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement