అర్హులందరూ ఓటు హక్కు పొందేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరూ ఓటు హక్కు పొందేలా చర్యలు

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

పుట్టపర్తి టౌన్‌: ఎన్యుమరేషన్‌ ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా చేపట్టి నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలోని 6, 7 వార్డుల సచివాలయాలకు కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ఏ విధంగా సాగుతోందనే దానిపై బీఎల్‌ఓలతో ఆరాతీశారు. అలాగే ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తప్పులు లేకుండా సర్‌ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు పొందేవిధంగా చూడాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధిగా కార్యాలయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలు అందించాలని ఆదేశించారు. సచివాలయాలపై నిరంతరం నిఘా ఉంటుందని విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, ఆర్డీఓ సువర్ణ ఉన్నారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement