సెరెనా తొలిపోరు మాయా జాయింట్‌తో... | Wimbledon Grand Slam tournament draw released | Sakshi
Sakshi News home page

సెరెనా తొలిపోరు మాయా జాయింట్‌తో...

Jun 27 2026 3:15 AM | Updated on Jun 27 2026 3:15 AM

Wimbledon Grand Slam tournament draw released

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ‘డ్రా’ విడుదల  

లండన్‌: నాలుగేళ్ల విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో పునరాగమనం చేస్తున్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు వింబుల్డన్‌ టోర్నీ తొలి రౌండ్‌లో సునాయాస ప్రత్యర్థి ఎదురైంది. సోమవారం మొదలయ్యే ఈ టోలో ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగుతున్న 44 ఏళ్ల సెరెనాతో తొలి రౌండ్‌లో 20 ఏళ్ల మాయా జాయింట్‌ (ఆ్రస్టేలియా) తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 53వ ర్యాంక్‌లో ఉన్న మాయా జాయింట్‌ గతేడాది వింబుల్డన్‌ టోలో అరంగేట్రం చేసి తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. 2021, 2022 లలో వింబుల్డన్‌ టోర్నీ తొలి రౌండ్‌ లోనే వెనుదిరిగిన సెరెనా 2018, 2019లలో రన్నరప్‌గా నిలిచింది. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్‌ టోర్నీని నిర్వహించలేదు. 

ఓవరాల్‌గా 22వసారి వింబుల్డన్‌ టోలో ఆడనున్న సెరెనా ఏడుసార్లు సింగిల్స్‌ విభాగంలో, ఆరు సార్లు డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించింది. ఈసారి తొలి రౌండ్‌ను సెరెనా దాటితే రెండో రౌండ్‌లో ఫిలిప్పీన్స్‌ రైజింగ్‌ స్టార్, ప్రపంచ 29వ ర్యాంకర్‌ అలెగ్జాండ్రా ఇయాలాతో ఆడే అవకాశం ఉంది. రెండో రౌండ్‌లోనూ సెరెనా విజయం సాధిస్తే... మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) ఎదురుకావచ్చు.  

ఒకే పార్శ్వంలో సినెర్, జొకోవిచ్‌ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ), ఏడుసార్లు విజేత నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. అంతా సాఫీగా సాగితే సినెర్, జొకోవిచ్‌ సెమీఫైనల్లో ఎదురవుతారు. 39 ఏళ్ల జొకోవిచ్‌ తన కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించాడు. మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గితే టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. తొలి రౌండ్‌లో మియోమిర్‌ (సెర్బియా)తో సినెర్‌... వు యిబింగ్‌ (చైనా)తో జొకోవిచ్‌ తలపడతారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement