లండన్: ఇటీవల ముగిసిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ... ప్రత్యక్ష వీక్షణల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 29 నుంచి జూలై 12 వరకు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో జరిగిన ఈ టోర్నీని 5,50,151 మంది అభిమానులు ప్రత్యక్షంగా చూశారు. గతేడాదితో పోల్చుకుంటే 1,381 మంది అధికంగా వీక్షించగా... 139 సంవత్సరాల చరిత్ర గల ఈ టోర్నమెంట్‌లో ఇదే అత్యధికం.
2019 తర్వాత తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి వర్షం అంతరాయం కలిగించకపోవడంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో పోల్చుకుంటే అభిమానుల ప్రత్యక్ష వీక్షణల్లో వింబుల్డన్ వెనుకబడి ఉంది. ఈ ఏడాది ఆ్రస్టేలియా ఓపెన్ గ్రాండ్‌స్టామ్ టోర్నీని 11 లక్షల మంది వీక్షించగా... ఫ్రెంచ్ ఓపెన్‌కు 5,89,500 మంది హాజరయ్యారు. ఇక గతేడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని 9 లక్షల మంది చూశారు.


