అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డు సాధించింది. 2026 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు 311 సిక్సర్లు బాదిన భారత జట్టు గతంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో బాదిన అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టింది. 2022 ఏడాదిలో టీమిండియా తాము ఆడిన టీ20 మ్యాచ్‌ల్లో 289 సిక్సర్లు బాదింది. తాజాగా తన రికార్డును తానే సవరించుకోవడం విశేషం.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 250కి పైగా సిక్సర్ల ఫీట్‌ను టీమిండియా రెండుసార్లు సాధించడం విశేషం. ఇక ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్స్‌లోనూ టీమిండియా మినహా మరే జట్టు కూడా ఈ రికార్డు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. 2026 ఏడాదిలో భారత్ 311 సిక్సర్లతో టాప్‌లో ఉండగా, సౌతాఫ్రికా (177 సిక్సర్లు), వెస్టిండీస్ (164 సిక్సర్లు) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తన పేరిట ఒక అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. 2026 క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ సూర్యకుమార్, అభిషేక్ శర్మల సరసన చేరాడు. 2022లో సూర్యకుమార్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 68 సిక్సర్లు, అభిషేక్ శర్మ (2026లో 63 సిక్సర్లు*, 2025లో 54 సిక్సర్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఇదీ చదవండి: సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణ.. ఆసీస్‌ను రక్షించిన బ్యాడ్‌లైట్


