షనక మెరుపులు | Sri Lanka win over West Indies in second T20 | Sakshi
Sakshi News home page

షనక మెరుపులు

Jun 15 2026 1:38 AM | Updated on Jun 15 2026 1:38 AM

Sri Lanka win over West Indies in second T20

రెండో టి20లో వెస్టిండీస్‌పై శ్రీలంక గెలుపు  

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో తొలి టి20లో ఓటమి పాలైన శ్రీలంక జట్టు... రెండో మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. మొదట లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కమిల్‌ మిషారా (40 బంతుల్లో 61 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దసున్‌ షనక (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో విజృంభించారు. 

విండీస్‌ బౌలర్లలో షామార్‌ జోసెఫ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ 18.1 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. రావ్‌మన్‌ పావెల్‌ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (26 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్లలో హసరంగ, చమీర చెరో మూడు వికెట్లు పడగొట్టారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement