అఫ్గానిస్తాన్ ఓపెనర్‌ వరల్డ్‌ రికార్డ్‌ | Sediqullah Atal Breaks Record For Highest ODI Score On Birthday | Sakshi
Sakshi News home page

AFG vs IRE: అఫ్గానిస్తాన్ ఓపెనర్‌ వరల్డ్‌ రికార్డ్‌

Aug 13 2026 4:17 PM | Updated on Aug 13 2026 4:38 PM

Sediqullah Atal Breaks Record For Highest ODI Score On Birthday

ఐర్లాండ్ గ‌డ్డ‌పై అఫ్గానిస్తాన్ త‌మ జైత్ర యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. బుధ‌వారం బెల్‌ఫాస్ట్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో వ‌న్డేలో ఆతిథ్య ఐర్లాండ్‌ను 42 ప‌రుగుల తేడాతో అఫ్గాన్ ఓడించింది. ఈ విజ‌యంలో అఫ్గానిస్తాన్ ఓపెన‌ర్లు సెదీఖుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్‌లది కీలక పాత్ర. వీరిద్దరూ భారీ సెంచరీలతో చెలరేగాడు.  

అటల్ కేవలం 120 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులు సాధించగా.. జద్రాన్ 118 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

అనంతరం లక్ష్య చేధనలో ఐరీష్ జట్టు 48 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ పేసర్ యామిన్ అహ్మద్‌జాయ్ నాలుగు, ర‌షీద్ ఖాన్ తలా మూడు వికెట్లు సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచ‌రీతో స‌త్తాచాటిన సెదీఖుల్లా అటల్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

పుట్టినరోజున వన్డేల్లో అత్యధిక వ్య‌క్తి స్కోర్ సాధించిన ప్లేయ‌ర్‌గా అటిల్ వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ టామ్ లాథ‌మ్ పేరిట ఉండేది. లాథమ్‌ తన 30 బర్త్‌డే రోజున నెదర్లాండ్స్‌పై 140 పరుగులు చేశాడు.

తాజా మ్యాచ్‌లో తన 25 పుట్టిన రోజున 143 పరుగులు చేసిన అటల్‌.. లాథమ్‌ ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌(134) ఉన్నారు.
చదవండి: ఓవరాక్షన్‌ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్టీవ్‌ స్మిత్‌పై ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement