పోరాడి ఓడిన సతీశ్‌ | Satish lost the fight | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సతీశ్‌

Aug 23 2024 4:00 AM | Updated on Aug 23 2024 4:00 AM

Satish lost the fight

జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్‌ సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు. యోకోహామాలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 47వ ర్యాంకర్‌ సతీశ్‌ 21–18, 18–21, 8–21తో ప్రపంచ 40వ ర్యాంకర్‌ కాంతాపోన్‌ వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయాడు. 

70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సతీశ్‌ తొలి గేమ్‌ను దక్కించుకొని రెండో గేమ్‌లో 18–15తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగాడు. అయితే థాయ్‌లాండ్‌ ప్లేయర్‌ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను 21–18తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సతీశ్‌ తడబడ్డాడు. సతీశ్‌కు 2,550 డాలర్ల (రూ. 2 లక్షల 14 వేలు) ప్రైజ్‌మనీ, 4,320 పాయింట్లు లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement