ఏడాదిగా వెంటాడుతున్నాడు | Bezawada GGH Supervisor Harassment | Sakshi
Sakshi News home page

ఏడాదిగా వెంటాడుతున్నాడు

Jul 31 2026 5:17 AM | Updated on Jul 31 2026 5:17 AM

Bezawada GGH Supervisor Harassment

మిమ్మల్ని ఇష్టపడ్డాడు, రమ్మంటున్నాడని మరో కార్మికుడితో అడిగిస్తున్నాడు 

విచారణ కమిటీ ముందు పారిశుద్ధ్య కార్మికురాలి ఆవేదన  

బెజవాడ జీజీహెచ్‌ సూపర్ వైజర్‌ లైంగిక వేధింపులు 

లబ్బీపేట(విజయవాడతూర్పు):  ‘నిన్ను ఇష్టపడుతున్నాను.. ఒక­సారి రావాలి’ అంటూ కార్మికుడు సతీష్‌ ద్వారా కొన్నాళ్లుగా సూపర్‌వైజర్‌ సోమరాజు తనను వెంటాడుతున్నాడంటూ విజయవాడ జీజీహెచ్‌ పారిశుద్ధ్య కార్మికురాలు గురువారం విచారణ కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాదిగా ఒత్తిడి చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మాట వినకపోవడంతో పని సరిగా చేయడం లేదని మరింత వేధిస్తున్నట్లు విచారణ అధికారులకు తెలిపింది. 

మరికొందరు కార్మికులూ అకారణంగా కేకలు వేస్తూ రుబాబు చేస్తుంటాడని సూపర్‌వైజర్‌పై ఫిర్యాదుచేశారు. ఇదిలా ఉంటే వార్డుల్లో హైజీన్‌ సరిగా ఉండటం లేదని ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ మేల్‌ నర్సు తమను వేధిస్తున్నారని మహిళా కార్మికులు ఫిర్యాదు చేశారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను కలెక్టర్, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులకు పంపుతున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ తెలిపారు.  

అసలేం జరిగిందంటే.. 
ఇటీవల జీతాల కోసం కలెక్టరేట్‌ వద్ద శానిటేషన్‌ కార్మికులు ధర్నా చేశారు. ఆ సమయంలో ఆస్పత్రిలో సూపర్‌వైజర్‌ సోమ­రాజు తమను వేధింపులకు గురి చేస్తున్నారని, ఒక్కొక్కరినీ ఒక్కో విధంగా చూస్తున్నారంటూ కార్మికులు మండిపడ్డారు. సూపర్‌వైజర్‌తోపాటు మరో కార్మికుడు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వీటిపై  మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ శుక్రవారం విచారణ పూర్తిచేసి ఇచి్చన నివేదికను కలెక్టర్, డీఎంఈలకు పంపించనున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ తెలిపారు. ఈ విచారణలో కమిటీ సభ్యులు లైంగిక వేధింపుల ఆరోపణలను నిర్ధారించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement