వైఎస్‌ ఆనంద్‌రెడ్డి కన్నుమూత | YS Anand Reddy passes away | Sakshi
Sakshi News home page

వైఎస్‌ ఆనంద్‌రెడ్డి కన్నుమూత

Jul 31 2026 4:50 AM | Updated on Jul 31 2026 4:50 AM

YS Anand Reddy passes away

నివాళులర్పించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు 

నేడు అంత్యక్రియలు.. హాజరుకానున్న వైఎస్‌ జగన్‌

పులివెందుల రూరల్‌ : మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వరుసకు పెదనాన్న, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సొంత పెదనాన్న వైఎస్‌ ఆనంద్‌రెడ్డి(87) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ పులివెందులలో మృతిచెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులలోని ఆయన స్వగృహానికి చేరుకుని నివాళులర్పించారు. 

కుటుంబ సభ్యులు వైఎస్‌ ప్రకాష్ రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ మధురెడ్డి, వైఎస్‌ ఆనంద్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ రాజేష్‌రెడ్డి, కుమార్తెలు సాధన, సునీత తదితరులు ఆయన భౌతికకాయం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలూ నివాళులర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్‌ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement