ప్రిన్స్‌ యాదవ్‌ అరుదైన రికార్డు | Prince Yadav Becomes Third Indian Cricketer To Hit Six On First Ball Of T20I Career, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రిన్స్‌ యాదవ్‌ అరుదైన రికార్డు

Jun 29 2026 9:46 AM | Updated on Jul 3 2026 2:22 PM

Prince Yadav Becomes Third Indian Cricketer To Hit Six On First Ball Of T20I Career

ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన యువ పేసర్ ప్రిన్స్‌ యాదవ్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

155 పరుగుల లక్ష్య ఛేదనలో నంబర్-11లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రిన్స్, భారత ఇన్నింగ్స్ చివరి బంతిని ఎదుర్కొన్నాడు. హ్యారీ టెక్టార్‌ వేసిన ఆ బంతిని భారీ సిక్సర్‌గా మలిచి అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు.

అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతినే సిక్సర్లుగా మలిచిన భారత బ్యాటర్లు..
- సూర్యకుమార్‌ యాదవ్‌ – ఇంగ్లండ్‌పై (2021), తొలి బంతికే జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో సిక్సర్
- రమన్‌దీప్‌ సింగ్‌ – దక్షిణాఫ్రికాపై (2024), తొలి బంతికే అండైల్‌ సైమ్‌లేన్‌ బౌలింగ్‌లో సిక్సర్
- ప్రిన్స్‌ యాదవ్‌ – ఐర్లాండ్‌పై (2026), తొలి బంతికే హ్యారీ టెక్టర్ బౌలింగ్‌లో సిక్సర్

అరంగేట్రం మ్యాచ్‌లో ప్రిన్స్‌ తొలుత బంతితోనూ ఆకట్టుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు.

అయితే ప్రిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత్‌కు విజయాన్ని అందించలేకపోయింది. ఆఖరి బంతికి అతడు సిక్సర్‌ కొట్టినా గెలుపుకు 2 పరుగులు తక్కువయ్యాయి. ఈ ఓటమితో భారత్‌ సిరీస్‌ను సైతం కోల్పోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement