సిరీస్‌ డిసైడర్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌ | New Zealand Lose Key Player Before Series Decider vs England | Sakshi
Sakshi News home page

సిరీస్‌ డిసైడర్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌

Jun 24 2026 9:32 PM | Updated on Jun 24 2026 9:32 PM

New Zealand Lose Key Player Before Series Decider vs England

ఇంగ్లండ్‌తో సిరీస్‌ డిసైడర్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. జేమీసన్‌ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతున్నాడు.

అతడి పనిభారాన్ని నియంత్రించేందుకు జట్టు యాజమాన్యం ముందుగానే మూడో టెస్ట్‌కు విశ్రాంతినివ్వాలని డిసైడ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ ఇదివరకే వెల్లడించాడు.

జేమీసన్‌ ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు కీలక బౌలర్‌గా నిలిచాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి, మ్యాచ్‌ మొత్తం ఆరు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోయినప్పటికీ, అతడి బౌలింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తర్వాత ఓవల్‌లో జరిగిన రెండో టెస్టులో కూడా అతడు నాలుగు వికెట్లు సాధించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్‌ 253 పరుగుల భారీ విజయానికి బాటలు వేశాడు. రెండు టెస్టుల్లో మొత్తం 10 వికెట్లు తీసిన జేమీసన్‌ సగటు 24.20గా ఉండటం అతడి ప్రభావాన్ని తెలియజేస్తోంది.

జేమీసన్‌ స్థానంలో వైట్‌బాల్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడో టెస్ట్‌ నాటింగ్హమ్‌ వేదికగా రేపటి నుంచి (జూన్‌ 25) ప్రారంభం కానుంది. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్‌ 1-1తో సమంగా ఉంది.

తొలి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, రెండో టెస్టులో న్యూజిలాండ్‌ అద్భుతంగా పునరాగమనం చేసి సిరీస్‌ను సమం చేసింది. దీంతో మూడో టెస్టు విజేతే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల దృష్ట్యా కూడా ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 66.67 శాతం పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. 

మరోవైపు ఇంగ్లండ్‌ ఏడో స్థానంలో కొనసాగుతోంది. సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ రేసులోనూ ముందంజ వేయాలంటే ఇరు జట్లకూ ఈ మ్యాచ్‌ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement