బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌పై ఘ‌న విజ‌యం | Josh Hazlewood Fifer As Australia Thrash West Indies On Day 3 To Win 1st Test, Check Out More Details | Sakshi
Sakshi News home page

WTC 2025-27: బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌పై ఘ‌న విజ‌యం

Jun 28 2025 8:14 AM | Updated on Jun 28 2025 9:15 AM

Josh Hazlewood fifer as Australia thrash West Indies on Day 3 to win 1st Test

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 సైకిల్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు మూడు టెస్టుల‌, ఐదు టీ20ల‌ సిరీస్ కోసం వెస్టిండీస్‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బార్బోడ‌స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ను 159 ప‌రుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది.

కంగారుల నిర్దేశించిన 300 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక క‌రేబియ‌న్లు చ‌తిక‌ల‌ప‌డ్డాడు. ఆసీస్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో విండీస్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 141 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. టెయిలాండ‌ర్ ష‌మీర్ జోష‌ఫ్‌(44), జ‌స్టిన్ గ్రీవ్స్‌(38) ప‌ర్వాలేద‌న్పించగా.. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో జోష్ హాజిల్‌వుడ్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగ‌గా.. నాథ‌న్ లియోన్ రెండు, స్టార్క్‌, క‌మ్మిన్స్ త‌లా వికెట్ సాధించారు.

ఆదుకున్న హెడ్‌, వెబ్‌స్టెర్‌
ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కొన్‌స్టాస్‌ (5), ఉస్మాన్‌ ఖ్వాజా (15), కామెరూన్‌ గ్రీన్‌ (15), జోష్ ఇంగ్లిష్‌(12) విఫలమవడంతో ఒక దశలో 65/4తో కష్టాల్లో పడ్డ జట్టును హెడ్(61), వెబ్‌స్టర్‌(63) ఆదుకున్నారు.

అదేవిధంగా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అలెక్స్ కారీ(65) ఆర్ధ‌శ‌త‌కంతో రాణించాడు.  కరీబియన్‌ బౌలర్లలో షమార్‌ జోసెఫ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అంత‌కుముందు  ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు... విండీస్‌ 190 పరుగులకు ఆలౌట్‌ అయ్యాయి. రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ హాఫ్ సెంచ‌రీతో మెరిసిన ట్రావెస్ హెడ్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు గ్రెనడా వేదిక‌గా వ‌చ్చే గురువారం నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: వైభవ్ సూర్య‌వంశీ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

Advertisement
 
Advertisement
Advertisement