ఐర్లాండ్‌తో మూడో టీ20.. సంజు శాంసన్‌పై వేటు! ఐపీఎల్‌ హీరో ఎంట్రీ | IRE vs IND predicted playing 11 | Sakshi
Sakshi News home page

IND vs IRE: ఐర్లాండ్‌తో మూడో టీ20.. సంజు శాంసన్‌పై వేటు! ఐపీఎల్‌ హీరో ఎంట్రీ

Aug 22 2023 1:47 PM | Updated on Aug 22 2023 3:12 PM

IRE vs IND predicted playing 11 - Sakshi

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మ్యాచ్‌ అయిన ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్దమైంది. బుధవారం డబ్లిన్‌ వేదికగా భారత్‌-ఐర్లాండ్‌ మధ్య మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని బుమ్రా సేన భావిస్తోంది. అదే విధంగా గత రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లకు ఆఖరి టీ20లో అవకాశం ఇవ్వాలని జట్టు మెన్‌జ్‌మెంట్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఆఖరి మ్యాచ్‌కు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురి స్ధానంలో వరుసగా జితేష్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌, అవేష్‌ ఖాన్‌ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌లో అదరగొట్టి జట్టులోకి వచ్చిన జితేష్‌ శర్మ.. అంతర్జాతీయ ‍క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాడు.

గత కొన్ని సిరీస్‌లకు జితేష్‌ ఎంపికవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం రావడం లేదు. అయితే ఐర్లాండ్‌తో ఆఖరి టీ20లో జితేష్‌ అరంగేట్రం దాదాపు ఖాయమన్పిస్తోంది. మరోవైపు అవేష్‌ ఖాన్‌ విండీస్‌తో టీ20 సిరీస్‌ ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడికి ఆఖరి టీ20లో ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐర్లాండ్‌ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్‌ డాక్రెల్‌ స్ధానంలో గ్రెత్‌ డెలానీకి ఛాన్స్‌ ఇవ్వాలని ఐరీష్‌ జట్టు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

తుది జట్లు(అంచనా)
భారత్‌: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, షాబాజ్‌ , ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రవి బిష్ణోయ్

ఐర్లాండ్‌: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్‌ కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్‌ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్
చదవండి: IND vs IRE: అయ్యో రింకూ.. ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్‌! బుమ్రా మంచి మనసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement