అయ్యో రింకూ.. ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్‌! బుమ్రా మంచి మనసు | Sakshi
Sakshi News home page

IND vs IRE: అయ్యో రింకూ.. ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్‌! బుమ్రా మంచి మనసు

Published Tue, Aug 22 2023 11:38 AM

Bumrah turns translator for Rinku - Sakshi

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో డబ్లిన్‌ వేదికగా జరిగిన రెండో టీ20 అనంతరం బుమ్రా తన చర్యతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రింకూ సింగ్‌ అదరగొట్టాడు.

తన తొలి ఇన్నింగ్స్‌లోనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈ యూపీ ఆటగాడు అందరిని అకట్టుకున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చిన రింకూ..  21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్‌కు మంచి స్కోర్‌ను అందించాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రింకూకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

సూపర్‌ బుమ్రా..
ఈ క్రమంలో పోస్ట్‌మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో సమయంలో రింకూ ఇంగ్లీష్‌లో మాట్లాడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. హిందీలో మాట్లాడితే ఫ్రీగా ఉంటుందని రింకూ ప్రెజెంటర్ అలాన్ విల్కిన్స్‌కు చెప్పాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న బుమ్రా ముందకు వచ్చి రింకూకు ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. విల్కిన్స్‌ ఇంగ్లీష్‌లో అడుగుతుంటే బుమ్రా దాన్ని హిందీలోకి అనువాదం చేసి రింకూకు అర్దమయ్యేలా చెప్పుకొచ్చాడు.

విల్కిన్స్ రింకూను నీవు కెప్టెన్‌ మాట వింటావా అంటూ ఇంగ్లీష్‌లో ప్రశ్నించాడు. దాన్ని హిందీలోకి బుమ్రా ట్రాన్సలేట్‌ చేశాడు.  అందుకు బదులుగా రింకూ నవ్వుతూ నేను ఎప్పుడూ కెప్టెన్‌ మాట వింటా అంటూ సమాధానమిచ్చాడు. తన మంచిమనసు చాటుకున్న బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టీ20 డబ్లిన్‌ వేదికగా ఆగస్టు 23న జరగనుంది.
చదవండి: Asia Cup 2023: జట్టులో పార్ట్‌టైమ్‌ బౌలర్స్‌ లేరా..? అదిరిపోయే రిప్లై ఇచ్చిన రోహిత్‌! వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement