క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌  | India in the quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 

Dec 10 2023 4:10 AM | Updated on Dec 10 2023 4:10 AM

India in the quarter finals - Sakshi

జూనియర్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. కౌలాలంపూర్‌లో పూల్‌ ‘సి’లో శనివారం జరిగిన పోరులో యువ భారత్‌ జట్టు 10–1తో కెనడాను చిత్తు చేసింది. ఈ విజయంతో తమ పూల్‌లో రెండో స్థానంలో నిలిచిన భారత్‌ నాకౌట్‌కు అర్హత సంపాదించింది. భారత జట్టులో ఆదిత్య అర్జున్‌ (8వ, 43వ నిమిషాల్లో), రోహిత్‌ (12వ, 55వ ని.), అమన్‌దీప్‌ లక్రా (23వ, 51వ ని.) రెండేసి గోల్స్‌ సాధించారు.

విష్ణుకాంత్‌ (42వ ని.), రాజిందర్‌ (42వ ని.), కుష్వాహ సౌరభ్‌ ఆనంద్‌ (51వ ని.), ఉత్తమ్‌ సింగ్‌ (58వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జూడ్‌ నికోల్సన్‌ 20వ నిమిషంలో చేశాడు. మంగళవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌... పూల్‌ ‘డి’ విజేత నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement