లంచ్‌ తర్వాత పూనకం... 29 పరుగుల వ్యవధిలోనే ఖేల్‌ ఖతం! | Sakshi
Sakshi News home page

Ind vs Eng 3rd Test Day 3: లంచ్‌ తర్వాత పూనకం వచ్చినట్లుగా.. 29 పరుగుల వ్యవధిలోనే!

Published Sat, Feb 17 2024 2:06 PM

Ind vs Eng 3rd Test Day 3: Ind Bowlers Shines England Collapse After Lunch 319 All Out - Sakshi

India vs England, 3rd Test Day 3: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టు మూడో రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భోజన విరామ సమయం తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ జోరుకు అడ్డుకట్ట వేశారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-1తో సమంగా ఉన్న టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య గురువారం మూడో టెస్టు ఆరంభమైంది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 445 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసి.. టీమిండియాకు దీటుగా బదులిచ్చింది.

ఈ క్రమంలో శనివారం ఆట ఆరంభం నుంచే ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు విజయవంతమయ్యారు. దెబ్బకు తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ లంచ్‌కు ముందు 290/5 స్కోరు వద్ద నిలిచింది.

అయితే, భోజనం చేసి మళ్లీ మైదానంలో దిగిన తర్వాత కేవలం 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో 319 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కాగా.. టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుస విరామాల్లో టీమిండియా బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌ వికెట్లు తీసిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌ రెండు, జడేజా రెండు, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ మూడో రోజు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అశ్విన్‌ లేకుండానే పది మంది యాక్టివ్‌ (బౌలింగ్‌, బ్యాటింగ్‌) ప్లేయర్లతో టీమిండియా బరిలోకి దిగింది.

మూడో రోజు ఇంగ్లండ్‌ వికెట్ల పతనం ఇలా..
►39.5వ ఓవర్‌: బుమ్రా బౌలింగ్‌లో- యశస్వి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి జో రూట్‌(18) అవుట్‌
►40.4వ ఓవర్‌: కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో- జానీ బెయిర్‌ స్టో ఎల్బీడబ్ల్యూ(0).
►50.1వ ఓవర్‌: కుల్దీప్‌ బౌలింగ్‌లో సెంచరీ వీరుడు బెన్‌ డకెట్‌(151) ఇన్నింగ్స్‌కు తెర

లంచ్‌ తర్వాత..
►65: జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చి స్టోక్స్‌ అవుట్‌(41)
►65.1: సిరాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన బెన్‌ ఫోక్స్‌(13)
►69.5: సిరాజ్‌ బౌలింగ్‌లో రెహాన్‌ అహ్మద్‌ బౌల్డ్‌(6)
►70.2: జడేజా బౌలింగ్‌లో టామ్‌ హార్లే స్టంపౌట్‌(9)
►71.1: సిరాజ్‌ బౌలింగ్‌లో ఆండర్సన్‌ క్లీన్‌బౌల్డ్‌(1).

తుదిజట్లు:
భారత్‌
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పాటిదార్‌, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్‌ కీపర్‌- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.
చదవండి: IND Vs ENG: సర్ఫరాజ్‌ ఖాన్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు! 

Advertisement

తప్పక చదవండి

Advertisement