హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం మోంగ్‌కాంగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్ సంచలన విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఆసీస్‌ను ఓడించిన పాక్.. కువైట్‌తో తుదిపోరుకు సిద్దమైంది.
ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఖవాజా నఫే(14 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. అబ్దుల్ సమద్(34), అబ్బాస్ అఫ్రిది(19) రాణించారు. ఆసీస్ బౌలర్లలో రాస్ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. కంగారుల విజయానికి చివరి ఓవర్‌లో 30 పరుగులు అవసరమవ్వగా.. క్రిస్ గ్రీన్ మెరుపులు మెరిపించాడు. అబ్దుల్ సమద్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతిని గ్రీన్ బౌండరీగా మలిచాడు.
అయితే తొలి బంతి నోబాల్ కావడంతో అతడికి ఫ్రీహిట్ లభించింది. కానీ గ్రీన్ ఫ్రీహిట్ బంతికి కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఆ తర్వాత గ్రీన్ వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. ఆఖరి రెండు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఐదో బంతికి గ్రీన్ రనౌటయ్యాడు. చివరి బంతికి ఆండ్రూ టై ఫోర్ కొట్టినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఒకవేళ అతడు సిక్స్ బాది ఉంటే ఆసీస్ ఫైనల్‌కు అర్హత సాధించేది.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. గంభీర్ మాస్టర్ మైండ్! 39 ఏళ్ల తర్వాత?
PAKISTAN THROUGH FINALS
Pakistan beats Australia by 1 run in the semi-final of Hong Kong sixes. pic.twitter.com/cF8OiXbH12— Cricket 🏏 (@Sunny29548707) November 9, 2025


