లండన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తొలుత కివీస్‌ను బ్యాటింగ్ అహ్హానించాడు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై న్యూజిలాండ్ 188 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో గ్లెన్ ఫిలిప్స్, వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే తొలి రోజు ఆట ముగుస్తుందన్న సమయంలో కివీస్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక బ్లండెల్ జాకబ్ బెథెల్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. ఆ తర్వాత నాథన్ స్మిత్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు.
280 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో న్యూజిలాండ్ కనీసం 350 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. అయితే రెండో రోజు ఆటలో మాత్రం ఫిలిప్స్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 133 బంతుల్లో ఫిలిప్స్ తొలి టెస్ట్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
అతడు సరిగ్గా 100 పరుగులు చేసి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే రెండో రోజు ఆటలో ఫిలిప్స్‌కు కైల్ జేమీసన్ (41) కూడా మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ జాకబ్ బెతల్ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, మాథ్యూ ఫిషర్, బాకర్ తలా రెండేసి వికెట్లు చొప్పున సాధించారు.
చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్


