సైక్లింగ్‌లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త! | British-Teenage-19 Years-Cyclist-Demise-Volta-A-Portugal-Tour-Crash | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త!

Aug 15 2026 10:33 AM | Updated on Aug 15 2026 10:49 AM

British-Teenage-19 Years-Cyclist-Demise-Volta-A-Portugal-Tour-Crash

Photo Credit: Twitter

సైక్లింగ్‌లో విషాదం నెల‌కొంది. బ్రిట‌న్ సైక్లిస్ట్ 19 ఏళ్ల ఫిన్లే టార్లింగ్ పోర్చుగ‌ల్‌లో నిర్వ‌హిస్తున్న సైక్లింగ్ టూర్‌లో పాల్గొన్నాడు. వోల్టా పోర్చుగ‌ల్ టూర్‌లో భాగంగా ఎనిమిదో ద‌శ‌లో సంభ‌వించిన ఘోర‌ ప్రమాదంలో గాయ‌ప‌డిన‌ ఫిన్లే శుక్ర‌వారం ప్రాణాలు విడిచాడు. మెల్గాకో నుండి ఫాఫే వరకు ఉన్న 166.8 కిలోమీటర్ల మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన వాహనం అతడిని ఢీకొట్టడంతో కింద పడిన టార్లింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.


Photo Credit: Twitter

కాగా ఫిన్లే టార్లింగ్ ప్ర‌స్తుతం ఎన్ఎస్ఎన్‌ డెవ‌ల‌ప్‌మెంట్ టీమ్ త‌ర‌ఫున పోటీ ప‌డుతున్నాడు. టైమ్ ట్ర‌య‌ల్స్‌లో నిపుణుడైన టార్లింగ్ గ‌తేడాదే ఎన్ఎస్ఎన్ డెవ‌ల‌ప్‌మెంట్ టీమ్‌లో చేరాడు. రోడ్ అండ్ ట్రాక్ సైక్లింగ్‌లోనూ బ్రిట‌న్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. కాగా ఫిన్లే మ‌ర‌ణ‌వార్త‌ను ఎన్ఎస్ఎన్ ఎక్స్ వేదిక‌గా ధృవీక‌రించింది. 

"ఈరోజు వోల్టా ఎ పోర్చుగ‌ల్‌లో ఫిన్లే టార్లింగ్ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించాడు. ఈ విష‌యం మ‌మ్న‌ల్ని చాలా బాధించింది. మా కుటుంబంలో ఒక‌డైన ఫిన్లే కుటుంబానికి ఇదే మా ప్ర‌గాడ సానుభూతి. అత‌డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నా." అంటూ ట్వీట్ చేసింది. 

కాగా ప్ర‌మాదం త‌ర్వాత రేసును నిలిపిపేసిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. కాగా 19 ఏళ్ల ఫిన్లే మృతిపై బ్రిటీష్‌, పోర్చుగీస్ సైక్లింగ్ స‌మాఖ్య నివాళి అర్పించింది.

Read: లైవ్ మ్యాచ్‌లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్‌.. లక్ష జరిమానా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement