breaking news
road cycling championship
-
సైక్లింగ్‌లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త!
సైక్లింగ్‌లో విషాదం నెలకొంది. బ్రిటన్ సైక్లిస్ట్ 19 ఏళ్ల ఫిన్లే టార్లింగ్ పోర్చుగల్‌లో నిర్వహిస్తున్న సైక్లింగ్ టూర్లో పాల్గొన్నాడు. వోల్టా పోర్చుగల్ టూర్లో భాగంగా ఎనిమిదో దశలో సంభవించిన ఘోర ప్రమాదంలో గాయపడిన ఫిన్లే శుక్రవారం ప్రాణాలు విడిచాడు. మెల్గాకో నుండి ఫాఫే వరకు ఉన్న 166.8 కిలోమీటర్ల మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన వాహనం అతడిని ఢీకొట్టడంతో కింద పడిన టార్లింగ్కు తీవ్ర గాయాలయ్యాయి.Photo Credit: Twitterకాగా ఫిన్లే టార్లింగ్ ప్రస్తుతం ఎన్ఎస్ఎన్ డెవలప్మెంట్ టీమ్ తరఫున పోటీ పడుతున్నాడు. టైమ్ ట్రయల్స్‌లో నిపుణుడైన టార్లింగ్ గతేడాదే ఎన్ఎస్ఎన్ డెవలప్మెంట్ టీమ్‌లో చేరాడు. రోడ్ అండ్ ట్రాక్ సైక్లింగ్‌లోనూ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా ఫిన్లే మరణవార్తను ఎన్ఎస్ఎన్ ఎక్స్ వేదికగా ధృవీకరించింది. "ఈరోజు వోల్టా ఎ పోర్చుగల్‌లో ఫిన్లే టార్లింగ్ ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషయం మమ్నల్ని చాలా బాధించింది. మా కుటుంబంలో ఒకడైన ఫిన్లే కుటుంబానికి ఇదే మా ప్రగాడ సానుభూతి. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా." అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రమాదం తర్వాత రేసును నిలిపిపేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా 19 ఏళ్ల ఫిన్లే మృతిపై బ్రిటీష్, పోర్చుగీస్ సైక్లింగ్ సమాఖ్య నివాళి అర్పించింది.🇵🇹 | Acabam de ser reveladas imagens que demonstram a brutalidade do embate fatal que vitimou Finlay Tarling.O jovem de 19 anos não terá resistido aos ferimento e faleceu no local. pic.twitter.com/YuXcZY8koR— Questiona-te (@questiona_te) August 14, 2026Read: లైవ్ మ్యాచ్‌లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా! -
తెలంగాణకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. కర్ణాటకలోని జామకండిలో జరిగిన ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించారు. 120 కి.మీ రోడ్ మాస్ స్టార్ట్ ఈవెంట్లో బి. ముగేశ్, 40 కి.మీ ఈవెంట్లో అమన్ పుంజరి చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 50 కి.మీ క్రిటోరియమ్ ఈవెంట్లో పరశురామ్ చెంజి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో రాణించిన సైక్లిస్టులను ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌బాబు బుధవారం అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. , -
పరశురామ్‌కు రజతం
జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు పరశురామ్ రాణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో 120కి.మీ మాస్ స్టార్ట్ రోడ్ రేస్ విభాగంలో పరశురామ్ రజత పతకాన్ని సాధించాడు. తెలంగాణ సైక్లింగ్ సంఘానికే చెందిన మరో క్రీడాకారుడు అమన్ ఈ రేస్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలోనూ తెలంగాణ సైక్లింగ్ టీమ్ ప్రతిభ కనబరిచింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన సైక్లిస్టులను తెలంగాణ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ అభినందించారు.


