తెలంగాణకు మూడు పతకాలు | telangana gets three medals in national road cycling | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మూడు పతకాలు

Nov 9 2017 10:48 AM | Updated on Nov 9 2017 10:48 AM

telangana gets three medals in national road cycling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రోడ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. కర్ణాటకలోని జామకండిలో జరిగిన ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించారు. 120 కి.మీ రోడ్‌ మాస్‌ స్టార్ట్‌ ఈవెంట్‌లో బి. ముగేశ్, 40 కి.మీ ఈవెంట్లో అమన్‌ పుంజరి చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు.

50 కి.మీ క్రిటోరియమ్‌ ఈవెంట్‌లో పరశురామ్‌ చెంజి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో రాణించిన సైక్లిస్టులను ‘శాట్స్‌’ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌బాబు బుధవారం అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement