పరశురామ్‌కు రజతం | parusaram gets silver medal in national road cycling championship | Sakshi
Sakshi News home page

పరశురామ్‌కు రజతం

Nov 11 2016 10:35 AM | Updated on Sep 4 2017 7:50 PM

జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు పరశురామ్ రాణించాడు.

జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్


 సాక్షి, హైదరాబాద్: జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు పరశురామ్ రాణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో 120కి.మీ మాస్ స్టార్ట్ రోడ్ రేస్ విభాగంలో పరశురామ్ రజత పతకాన్ని సాధించాడు. తెలంగాణ సైక్లింగ్ సంఘానికే చెందిన మరో క్రీడాకారుడు అమన్ ఈ రేస్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

 

టీమ్ విభాగంలోనూ తెలంగాణ సైక్లింగ్ టీమ్ ప్రతిభ కనబరిచింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన సైక్లిస్టులను తెలంగాణ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ అభినందించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement