
ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో భారత స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయపడ్డాడు.
త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి గిల్ చేతికి బలంగా తాకింది. వెంటనే గిల్ నొప్పితో విలవిల్లాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి అతడి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడు. అయితే విశ్రాంతి తీసుకున్నాక గిల్ తన ప్రాక్టీస్‌ను తిరిగి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
కానీ గిల్ కాస్త ఆసౌకర్యంగా కన్పించనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటివరకు అతడి గాయంపై టీమ్ మెనెజ్‌మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ గిల్ గాయం కారణంగా దూరమైతే అది భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. గిల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో 20 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
భారత్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి