Telangana Crime News: టెలిగ్రామ్‌ లింక్‌ పేరుతో.. సైబర్‌ మోసం!
Sakshi News home page

టెలిగ్రామ్‌ లింక్‌ పేరుతో.. సైబర్‌ మోసం!

Aug 20 2023 12:20 AM | Updated on Aug 20 2023 12:51 PM

- - Sakshi

రాజన్న: అత్యాశకు పోయి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లికి చెందిన యువకుడు రూ.7.67లక్షలు పోగొట్టుకున్నాడు. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాలు. స్తంభంపల్లికి చెందిన అక్కెనపెల్లి హరీశ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ బయోటెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో వచ్చిన మెస్సేజ్‌తో టెలిగ్రామ్‌ లింక్‌ ఓపెన్‌ చేశాడు.

మొదట యూట్యూబ్‌ ద్వారా కొన్ని వీడియోలు పంపితే నెలకు రూ.3వేలు ఇస్తామని చెప్పడంతో అలా చేశాడు. కొద్ది రోజులకు యాప్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతాయని నమ్మబలకడంతో ఈనెల 9, 10, 11 తేదీలలో ఫోన్‌పే, గూగూల్‌పే ద్వారా వారు చెప్పిన నంబర్లకు రూ.7.67లక్షలు పంపించాడు. చివరికి యాప్‌ ఫేక్‌ అని తెలుసుకొని 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. ఎస్సై మహేందర్‌ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సైబర్‌ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement