సిరిసిల్లఅర్బన్: ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ అన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టరేట్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సిఫారసులు చేయిస్తానని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గసికంటి శ్రీనివాస్, నాయకులు జయకృష్ణారెడ్డి, జగన్‌మోహన్, కటకం శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


