రేపు ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసనలు | YSRCP womens wing held State Wide Protest Updates Details Here | Sakshi
Sakshi News home page

రేపు ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసనలు

Jun 9 2025 7:55 PM | Updated on Jun 9 2025 9:30 PM

YSRCP womens wing held State Wide Protest Updates Details Here

సాక్షి, గుంటూరు: ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రేపు(మంగళవారం) రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం పిలుపు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిర్ణయించింది.  

కూటమి పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ ఘోరంగా ఫెయిల్‌ అయ్యింది. ఏడాది పాలనలో నేరాలు ఘోరాలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా హోం మంత్రి అనిత కనీసం స్పందించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో సగటున రెండు రోజులకి ఒక అత్యాచారం జరుగుతుండగా.. ఇంకా వెలుగులోకి రాని అఘాయిత్యాలు ఎన్నో?!. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులు మాని.. ఆడబిడ్డల రక్షణపై శ్రద్ధ పెట్టమని వైఎస్సార్‌సీపీ చంద్రబాబుకు హితవు పలుకుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement