పశ్చిమ డెల్టాకు 3,115 క్యూసెక్కులు విడుదల | - | Sakshi
Sakshi News home page

పశ్చిమ డెల్టాకు 3,115 క్యూసెక్కులు విడుదల

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

పశ్చిమ డెల్టాకు 3,115 క్యూసెక్కులు విడుదల జిల్లాలో 17 మండలాల్లో వర్షం వైద్యులపై దాడులు అరికట్టాలి

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 3,115 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌లోని హైలెవెల్‌ చానల్‌కు 126 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌కు 759 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 273, పశ్చిమ కాలువకు 117, నిజాంపట్నం కాలువకు 176, కొమ్మమూరు కాలువకు 1,310 క్యూసెక్కులు విడుదల చేశారు.

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 47.6 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 2.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 15.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లిపర మండలంలో 37.6 మి.మీ., తెనాలి 36.4, పెదకాకాని 30.2, మేడికొండూరు 25.8, గుంటూరు తూర్పు 24.6, గుంటూరు పశ్చిమ 18.2, చేబ్రోలు 15.8, మంగళగిరి 9.4, ఫిరంగిపురం 9, పెదనందిపాడు 8.4, తుళ్లూరు 6.8, తాడేపల్లి 3.4, తాడికొండ 3.2, కాకుమాను 3.2, పొన్నూరు మండలంలో 2.8 మి.మీ చొప్పున వర్షం పడింది. ఆగస్టు 9వ తేదీ నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 47.8 మి.మీ కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 43.3 మి.మీ వర్షపాతం నమోదైంది.

గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో ‘అభయ డే’

గుంటూరు మెడికల్‌ ఫాగ్సి, గుంటూరు ఆబ్‌స్ట్రిక్స్‌ – గైనకాలజికల్‌ సొసైటీ (జీఓజీఎస్‌)సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు నగరంలో ‘‘అభయ డే’’గా పాటిస్తూ వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ బి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌, డాక్టర్‌ రాజకుమారి, డాక్టర్‌ షమా సుల్తానా, డాక్టర్‌ అనిత, డాక్టర్‌ ప్రత్యూష, డాక్టర్‌ అన్నె, పీడియాట్రీషియన్‌ డాక్టర్‌ సాహితి, కేర్‌ డెంటల్‌ కాలేజ్‌ వైద్యులు, గైనకాలజీ వైద్యుల సంఘం సభ్యులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. అహల్య ట్రస్ట్‌ నిర్వాహకులు, ప్రముఖ ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ... వైద్య విద్య పూర్తయిన రోజున హిపోక్రటిక్‌ ప్రమాణం చేసి రోగి ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రతిజ్ఞ చేసే వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు జరగడం అత్యంత విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై దాడి చేసినా, బెదిరించినా, ఆసుపత్రిని ధ్వంసం చేసినా కఠినమైన, వేగవంతమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రాణాలు కాపాడే చేతులను కాపాడుకుంటూ సురక్షితమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలని యూనియన్‌ నేతలు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement