మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ వాలీబాల్‌ పోటీలు ప్రారంభం సాగర్‌ నీటిమట్టం

దుగ్గిరాల: ఆషాఢ మాసం చివరి ఆదివారం దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పూలంగి సేవలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. చిలువూరుకు చెందిన రంగిశెట్టి జగదీష్‌ చండీ హోమం నిర్వహించారు. దాతల సహాయంతో మహిళలకు ఉచితంగా పొంగలి సామగ్రి అందించారు. పెద్ద సంఖ్యలో ఆలయ ఆవరణలో మహిళలు కట్టెల పొయ్యిలపై పొంగలి వండారు. మేళతాళాలు, కనక తప్పెట్లు మధ్య భక్తిశ్రద్ధలతో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ నిర్వహణ కమిటీ పర్యవేక్షించింది.

ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ ఘనంగా జరిగింది. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఆదివారం అమ్మవారి సన్నిధిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యోపాసన సేవ జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి అర్చకులు పూజలు చేశారు. అనంతరం అరుణ పారాయణం, మహా సౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని పఠించారు. సూర్య భగవానుడిని ఆరాధించడంతో సంపూర్ణ ఆరోగ్యం.. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో ఆదివారం ఏపీస్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్పీఎఫ్‌) ఆధ్వర్యాన ఇంటర్‌జోన్‌ వాలీబాల్‌ పోటీలు జరిగాయి. తొలుత పోటీలను ఏపీఎస్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ బీవీ రామిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గెలుపే లక్ష్యంగా కాకుండా క్రమశిక్షణతో ఆడటం, ప్రత్యర్థిని గౌరవించడం నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విమానాశ్రయ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఇంటర్‌ జోన్‌లో భాగంగా ఏపీ సెక్రటేరియట్‌, ఏపీ హైకోర్టు, ఎన్‌టీటీపీఎస్‌, ఎయిర్‌పోర్ట్‌ యూనిట్‌, విజయవాడ గార్డ్స్‌, హెడ్‌ క్వార్టర్‌ యూనిట్ల మధ్య పోటీలు నిర్వహించారు. విజేతగా నిలిచిన జట్టుకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు స్వాతంత్య్ర దినోత్సవాన బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అసిస్టెంట్‌ కమాండెంట్‌ కె.రమేష్‌ తెలిపారు. విజయవాడ జోన్‌ కమాండెంట్‌ ఎం.శంకరరావు, ఎయిర్‌పోర్ట్‌ సీఎస్‌ఓ కె.ధర్మేంద్ర, పలువురు విమానాశ్రయ, ఎస్పీఎఫ్‌ అధికారులు పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.30 అడుగులకు చేరింది. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 13,435 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement