ఏపీలో పనికిమాలిన పాలన: లక్ష్మీపార్వతి | YSRCP Lakshmi Parvathi Slams Kutami Prabhutvam | Sakshi
Sakshi News home page

ఏపీలో పనికిమాలిన పాలన: లక్ష్మీపార్వతి

Jun 24 2025 1:33 PM | Updated on Jun 24 2025 3:27 PM

YSRCP Lakshmi Parvathi Slams Kutami Prabhutvam

సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయిందని.. టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..

‘‘చంద్రబాబు ముఖానికి పట్టుమని పది మంది కూడా రారు. అందుకే వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయింది.అందుకే టీడీపీ ుండాలు రెచ్చిపోతున్న చూస్తూ ఉండిపోతోంది.

రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత  ఎక్కడ ఉన్నారు?. లోకేష్‌కు పొలిటికల్‌ నాలెడ్జ్‌ లేదు. లోకేష్‌ షాడో సీఎం.. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రీకొడుకులతో ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తోంది.

ఏపీలో రాజకీయ నేతలను, మహిళలను వేధిస్తున్నారు. గుడ్‌ గవర్నెన్స్‌ అంటే గిరిజన పిల్లలను నేల మీద పడుకోబెట్టడమా?. సనాతని వేషం వేసుకుని పవన్‌ కల్యాణ్‌ తిరుగుతున్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్‌. వైఎస్‌ జగన్‌ పాలనలో దిశ యాప్‌తో మహిళలకు రక్షణ ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా బలోపేతం కూడా అయ్యారు’’ అని లక్ష్మీపార్వతి అన్నారు.

దరిద్రపు పరిపాలన.. తండ్రికొడుకుని ఒక్కటే అడుగుతున్న

Advertisement
 
Advertisement
Advertisement