ఎన్డీయే విజయావకాశాలపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు

Prashant Kishor Predicts Clean Sweep For NDA Lok Sabha Polls - Sakshi

బిహార్‌లో నితీష్‌ కుమార్ బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు జేడీయూ అధినేత నితీష్‌.. ఎన్డీఏ కూటమిలో చేరటంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. నితీష్‌ బిహార్‌లోని మహాకూటమి నుంచి వైదొలిగి.. ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఎటువంటి  ప్రభావం పడదని కాంగ్రెస్‌ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్‌ కిషోర్‌ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై ఓ టీవీ చానెల్‌కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో  కీలక వ్యాఖ్యలు చేశారు.

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధిక సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు. బిహార్‌లో నీతిష్‌  కుమార్‌ తిరిగి మాళ్లీ ఎన్డీయేలో చేరటంతో ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

బిహార్‌లో మహా కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్‌పై ప్రశాంత్‌ కిషోర్‌ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్‌ రాజకీయం జీవితంలో ఇదే చివరి ఇన్సింగ్స్‌ అన్నారు.  రాజకీయాల్లో నితీష్‌ చాలా కపటంతో కూడిన వ్యక్తి అని మండిపడ్డారు. 2025లో జరగబోయే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో కూడా జేడీయూ విజయం సాధించలేదని జోష్యం చెప్పారు.

నితీష్‌ ఏ కూటమితో పొత్తు పెట్టుకున్నా సరే.. ఆయన పార్టీ అంతం కావటం ఖాయమన్నారు. కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతారని అన్నారు. నితీష్‌ను బిహార్‌ ప్రజలు తిస్కరిస్తున్నారని.. అందుకే తన సీఎం కుర్చీ కోసం కూటములు మారుతున్నారని మండిపడ్డారు. బిహార్‌లో ఇండియా కూటమిని దెబ్బతీయటానికి బీజేపీ.. నితీష్‌ కుమార్‌తో ఎత్తుగడ వేసిందన్నారు. కానీ.. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా పార్లమెంట్‌లో ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధిస్తుందని  అన్నారు. 

ఇక.. ఎన్డీయే కూటమిలో చేరిన నితీష్‌ కుమార్‌ 2025లో  జరగబోయే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వరకు మళ్లీ బయటకు వస్తారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లో ఎన్డీయేతో నితీష్‌కు విభేదాలు వస్తాయని అంచనా వేసిన విషయం తెలిసిందే.
చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top