ఏపీకి షర్మిల రాకపై మంత్రి రోజా సెటైర్లు | Minister RK Roja Satirical Comments On YS Sharmila, Details Inside - Sakshi
Sakshi News home page

ఏపీకి షర్మిల రాకపై మంత్రి రోజా సెటైర్లు

Jan 23 2024 12:02 PM | Updated on Feb 3 2024 9:05 PM

Minister Rk Roja Comments On Sharmila - Sakshi

సాక్షి, తిరుపతి: ఏపీకి షర్మిల రాక.. మరొక నాన్‌లోకల్‌ పొలిటీషియన్‌ వచ్చినట్టేనని.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు  ఓటు అడిగే హక్కులేదని మంత్రి రోజా అన్నారు. వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని, కాంగ్రెస్‌ పార్టీ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించిందని ఆమె ధ్వజమెత్తారు. స్విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వడమాల పేటలో  క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంప్‌ను మంత్రి రోజా మంగళవారం ప్రారంభించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో 14వ సారి పింక్ బస్ క్యాంప్‌ నిర్వహించి మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటికి దీపం ఇల్లాలు.. ప్రతి ఇంట్లో మహిళ పింక్ బస్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనలో విద్య, వైద్యం, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement