సాక్షి,అమరావతి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోషియేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన 2026–జాతీయ స్థాయి పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు పలు అవార్డులు లభించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన 110 మంది ఫొటో జర్నలిస్టులు పోటీల్లో పాల్గొన్నారు. స్పాట్ న్యూస్, జనరల్‌న్యూస్ కేటగిరీల్లో ఫొటోలను స్వీకరించారు. నిర్వాహకులు ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి 50 అవార్డులు ప్రకటించారు. వీటిలో 9 మంది సాక్షి ఫొటోగ్రాఫర్లకు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి.
స్పాట్‌న్యూస్ విభాగంలో ఎచీవ్‌మెంట్ అవార్డ్స్: నడిపూడి కిషోర్ (విజయవాడ), వి. శ్రీనివాసులు (కర్నూలు).
కన్సోలేషన్ అవార్డ్స్: పీఎల్ మోహన్ (విశాఖపట్నం), కె.చక్రపాణి (విజయవాడ).
జనరల్ న్యూస్ విభాగంలో ఎచీవ్‌మెంట్ అవార్డ్స్: కె.మోహన్‌కృష్ణ (తిరుపతి), ఎ.కమలాకర్ (నెల్లూరు).
కన్సోలేషన్ అవార్డ్స్: పి.విజయకృష్ణ (నెల్లూరు), కె.జయశంకర్ (శ్రీకాకుళం), ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ).పోటీలకు న్యాయనిర్ణేతలుగా సీనియర్ జర్నలిస్ట్ ఆర్.అప్పాజీ, ఐఅండ్‌పీఆర్ ఫొటో గ్రాఫర్ ఎ.రాజేంద్రప్రసాద్, సీనియర్ ఫొటో జర్నలిస్ట్ సీహెచ్ నారాయణ, ఏపీపీజేఏ ప్రెసిడెంట్ సీహెచ్‌వీఎస్ విజయ్‌భాస్కరరావు వ్యవహరించారు.


