మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ప్రమాదం | Former MLA Talari Venkat Rao bike accident | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ప్రమాదం

Aug 12 2026 4:58 AM | Updated on Aug 12 2026 4:58 AM

Former MLA Talari Venkat Rao bike accident

వెంకట్రావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న మాజీ ఎంపీ భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి

కాళ్లు, చేతులు, తలకు గాయాలు

రాజమహేంద్రవరం సిటీ: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ కో–ఆర్డీనేటర్‌ తలారి వెంకట్రావు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయన మంగళవారం ఉదయం పొలం నుంచి ఇంటికి బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంకట్రావు తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని వెంటనే రాజమహేంద్రవరంలోని ఆదర్శ్‌ హాస్పిటల్‌కు తరలించారు. 

చికిత్స పొందుతున్న తలారి వెంకట్రావును వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, నేతలు డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, తోట రామకృష్ణ, డాక్టర్‌ జక్కంపూడి రాజశ్రీ తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement