రూ.కోటి ఖర్చు చేస్తేనే గెలుపు.. ఆ పంచాయతీపై నేతల కన్ను! | Krishnapatnam Panchayat Sarpanch Eelection RS One Crore Spending Demand | Sakshi
Sakshi News home page

రూ.కోటి ఖర్చు చేస్తేనే గెలుపు.. ఆ పంచాయతీపై నేతల కన్ను!

Nov 16 2026 11:24 AM | Updated on Nov 16 2026 11:24 AM

Krishnapatnam Panchayat Sarpanch Eelection RS One Crore Spending Demand

నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు తదితరాలున్న పంచాయతీ రాజకీయంగా కాక పుట్టిస్తోంది. ముత్తుకూరు మండలంలో 20 పంచాయతీలు ఉండగా, దేనికీ ఇంతటి డిమాండ్‌ ఏర్పడటం లేదు. 4460 ఓట్లతో మేజర్‌ పంచాయతీగా ఉన్న కృష్ణపట్నంపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా ఇక్కడి రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. రానున్న సర్పంచ్‌ ఎన్నికల్లో దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే ఎవరు బరిలో దిగి గెలవాలన్నా, రూ.కోటి ఖర్చు చేయాల్సి ఉంటుందనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. 

రెబల్స్‌ దెబ్బ 
ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పారీ్టలో రెబల్‌ అభ్యర్థి బరిలోకి దిగడం రాజకీయంగా కలకలం రేపింది. భారీగా ఓట్లు రావడంతో టీడీపీలో చీలిక ఏర్పడింది. దీంతో పార్టీ నాయకత్వానికి ఈ పరిణామం గట్టి హెచ్చరికగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. అయితే ఈసారి కూడా తగ్గేది లేదు.. అధికార పార్టీని గెలవనివ్వమంటూ రెబల్‌ వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయనే ప్రచారం స్థానికంగా మరింత వేడిని పెంచుతోంది. 

గ్రూపుల పోరు 
మరోవైపు రెండు, మూడు గ్రూపులుండటం టీడీపీకి మరో తలనొప్పిలా మారింది. అభ్యర్థి ఎంపిక దగ్గర్నుంచి ప్రచారం వరకు అంతర్గత విభేదాలు ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు కృష్ణపట్నంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండటంతో పోరు మరింత రసవత్తరంగా మారనుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement