కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత.. | Kalyandurg: Police Stop Talari Rangaiah Padayatra | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత.. తలారి రంగయ్య పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

Jun 4 2025 5:48 PM | Updated on Jun 4 2025 6:44 PM

Kalyandurg: Police Stop Talari Rangaiah Padayatra

అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రూరల్ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్ (ఆర్డీటీ)ని రక్షించాలని కోరుతూ మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి సంఘీభావం తెలిపారు.

మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గొంచితండాలో పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో.. వారికి, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్ (ఆర్డీటీ)కి రెన్యువల్ చేసేదాకా పోరాటం కొనసాగిస్తానని తలారి రంగయ్య స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement