మరోసారి బయటపడ్డ టీడీపీ గ్రూపు రాజకీయాలు | Group Politics In Kalyandurg TDP | Sakshi
Sakshi News home page

మరోసారి బయటపడ్డ టీడీపీ గ్రూపు రాజకీయాలు

Sep 4 2023 5:58 PM | Updated on Sep 4 2023 7:25 PM

Group Politics In Kalyandurg TDP - Sakshi

అనంతపురం:  చంద్రబాబు పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ  గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇంచార్జ్‌ ఉమామహేశ్వర నాయుడుల మధ్య వార్‌ మొదలైంది.  చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయంలో సమావేశం జరగ్గా, పరస్పరం బాహాబాహికి దిగారు ఉన్న, ఉమా వర్గీయులు. 

ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ పరిశీలకుడు బీటీ నాయుడు సమక్షంలోనే టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఇరు వర్గాలు బాహాబాహికి దిగడం టీడీపీలో గ్రూపు రాజకీయాలకు అద్దం పడుతోంది. 



 

Advertisement
 
Advertisement
Advertisement