ఆరోగ్యకర దేహంతోనే స్వచ్ఛమైన ఆలోచనలు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకర దేహంతోనే స్వచ్ఛమైన ఆలోచనలు

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

ప్రశాంతినిలయం: శరీరం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే స్వచ్ఛమైన ఆలోచనలు పుడతాయని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ పేర్కొన్నారు. పుట్టపర్తిలో ఆదివారం నిర్వహించిన ‘శ్రీ సత్యసాయి 5కే రన్‌ అండ్‌ రైడ్‌–ఏ స్పిరిట్‌ ఆఫ్‌ యూనిటీ’ కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. సత్యసాయి హిల్‌ వ్యూ స్టేడియంలో ఉదయం 5.30 గంటలకు ఆర్‌జే రత్నాకర్‌ రాజు, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్‌ పాండే లాంఛనంగా జెండా ఊపి రన్‌ అండ్‌ రైడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత మహిళా క్రికెట్‌ జట్టు కోచ్‌ అమోల్‌ మజుందార్‌, కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ఎస్పీ సతీష్‌ కుమార్‌, జేసీ మౌర్య భరద్వాజ్‌, ఆర్డీఓ సువర్ణ, హిమవాహినీ రత్నాకర్‌, కమలాపాండ్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా రత్నాకర్‌ మాట్లాడుతూ దేశంలోని 45 ప్రధాన నగరాల్లో ఇప్పటి వరకూ నిర్వహించిన రన్‌ అండ్‌ రైడ్‌లో 1.20 లక్షల మంది పాల్గొన్నారన్నారు. తాజాగా పుట్టపర్తిలో 19 వేల మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. పని ఒత్తిడి కారణంగా చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్యసాయి బాబా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

● హిల్‌వ్యూ స్టేడియంలో ప్రారంభమైన 5కే రన్‌ అండ్‌ రైడ్‌ ఎనుములపల్లి గణేష్‌ సర్కిల్‌, పెట్రోలు బంకు, పెద్ద కమ్మవారిపల్లి రోడ్‌ మీదుగా తిరిగి హిల్‌వ్యూ స్టేడియం చేరుకుంది. దారి వెంబడి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్‌ సేవలు, తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు

పుట్టపర్తిలో ఉత్సాహంగా

5కే రన్‌ అండ్‌ రైడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement