అనంతపురం అర్బన్: వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంపై ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన చర్చావేదికకు అనంతపురం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 20 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. వీరితో ప్రధాని ముచ్చటించారు. సరిహద్దు గ్రామాల్లో వారు పొందిన అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు కలెక్టర్ ఆనంద్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ‘మై భారత్ ప్రోగ్రాం’ సూపర్‌వైజర్ శ్రీనివాసులు, కో–ఆర్డినేటర్ బిసాతి భరత్, ఆన్‌సెట్ మేనేజర్ శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డుగ్రహీతలు బిసాతి జీవన్‌కుమార్, జయమారుతి, వలంటీర్లు అంబరీష్, రాము, సాయికార్తీక్ పాల్గొన్నారు.


