‘మత్స్యకారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే’ | Ex Minister Seediri Appalaraju Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘మత్స్యకారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే’

Apr 26 2025 9:24 PM | Updated on Apr 26 2025 9:29 PM

Ex Minister Seediri Appalaraju Fires On Chandrababu

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇవాళ చంద్రబాబు.. మత్సకారుల సంక్షేమం కోసం ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని.. ఈ 44 ఏళ్ల కాలంలో వారి సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీశారు. టీడీపీ 44 ఏళ్ల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎన్ని హార్బర్లు కట్టారు?, ఎన్ని పోర్టులు కట్టారు? అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సమయంలో మత్సకారుల కష్టాలను చూసి వారి సంక్షేమానికి ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టారన్నారు.

‘‘గత ప్రభుత్వంలో చేపట్టిన హార్బర్ల పనులు అన్ని అర్ధాంతరంగా ఆపేశారు. మీరు ఈ రోజు అదే ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో చంద్రబాబు మీటింగ్ పెట్టారు. రివైజ్ డీపీఆర్‌ పేరుతో అన్ని ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు ఆపేశారు. చంద్రబాబుకు ఎప్పుడూ మత్స్యకారులు అంటే చిన్న చూపే. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రతీ జిల్లాకు ఒక హార్బర్ ఉండాలని మొదలు పెట్టి నాలుగు హార్బర్ల నిర్మాణం పూర్తి చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఎన్ని పోర్టులు కట్టారు?. ఒక్క పోర్టు కూడా కట్టలేదు. వైఎస్‌ జగన్‌ హయాంలో నాలుగు పోర్టులు ప్రారంభమయ్యాయి.

మత్స్యకార భరోసా 20 వేలు ఇచ్చామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. మరి గత సంవత్సరం మత్స్యకార భరోసా బకాయిల పరిస్థితి ఏంటి?. గత టీడీపీ హయాంలో 4 వేల మత్స్యకార భరోసా ఇస్తే.. వైఎస్‌ జగన్‌ పాలనలో రూ.10 వేలు రూపాయలు అందించాం. 2023-24 మధ్యలో మత్స్యకార భరోసా బకాయిలు కూడా చంద్రబాబు ఇవ్వాల్సిందే. ఐదేళ్ల కాలంలో ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా 3 ఏళ్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

..తక్షణమే ఆపేసిన బుడగట్లపాలెం హార్బర్ పనులు ప్రారంభించండి. నువ్వులరేవు హార్బర్ పనులకు అనుమతులు తీసుకురండి. చంద్రబాబుకు పరిపాలన చేతగాక లక్షా యాభై వేల కోట్లు రూపాయలు అప్పు చేశారు. అచ్చెన్నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకు రాలేదు. ఉర్సా ట్రస్టు భూములు ఎలా అప్పనంగా ప్రవేట్ కంపెనీలు కట్టబెడతారు?. 6 నెలల క్రితం అమెరికాలో పెట్టిన కంపెనిపై ఎందుకంత ఆసక్తి’’ అంటూ అప్పలరాజు ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement