తెలంగాణలో పొలిటికల్‌ ట్విస్ట్‌.. మళ్లీ కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే! | BRS MLA Bandla Krishna Mohan Will Join In Congress | Sakshi
Sakshi News home page

మంత్రి జూపల్లి ప్లాన్‌ సక్సెస్‌.. మళ్లీ కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే!

Aug 1 2024 9:36 AM | Updated on Aug 1 2024 10:47 AM

BRS MLA Bandla Krishna Mohan Will Join In Congress

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కాగా, గురువారం ఉదయం మంత్రి జూపల్లి.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరూ తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో, మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన సిద్ధమైనట్టు సమాచారం. కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్‌ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

అయితే, మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. దీంతో, మంత్రి జూపల్లి రంగ ప్రవేశం చేసి ఆయనతో చర్చలు జరిపారు. ఇక, బండ్ల కృష్ణమోహన్‌తో నిన్న జీఎంఆర్‌ కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ హస్తం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement