ఎనిమిదో తరగతి విద్యార్థిపై సీనియర్ల దాడి | Senior student attacks 8 Class student in Vikarabad | Sakshi
Sakshi News home page

ఎనిమిదో తరగతి విద్యార్థిపై సీనియర్ల దాడి

Aug 17 2026 1:50 AM | Updated on Aug 17 2026 1:50 AM

Senior student attacks 8 Class student in Vikarabad

బాధిత విద్యార్థితో మాట్లాడుతున్న పట్టణ ఎస్‌ఐ సుమాన్‌ అలీ

పెద్దేముల్‌ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో చపాతి కర్రతో వాతలు

తాండూరు రూరల్‌: ఓ విద్యార్థికి సీనియర్‌ విద్యార్థులు చపాతి కర్రతో వాతలు పెట్టారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ శివారులోని పెద్దేముల్‌ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ (తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌) పాఠశాల, కళాశాలలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. ఎనిమిదో తరగతి విద్యార్థి బాలాజీ ఉదయం హాస్టల్‌ విద్యార్థులతో కలిసి చపాతీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో సీనియర్‌ విద్యార్థులు బాలాజీకి చపాతి కర్రతో కాళ్లకు వాతలు పెట్టారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. 

గేటు తెరవకపోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్‌ఐ సుమాన్‌ అలీ సిబ్బందితో హాస్టల్‌కు చేరుకున్నారు. పోలీసులు వచ్చిన విçషయం ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్‌కు ఫోన్‌లో చెప్పి గేటు తెరిచారు. అయితే హాస్టల్‌లో జరిగిన ఘటనపై రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తాండూరు టౌన్‌ సీఐపరమేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్‌ చేయడంతో ఎస్‌ఐ సుమాన్‌ అలీ సిబ్బందితో వెళ్లి హాస్టల్‌ వద్ద భద్రతా చర్యలు చేపట్టారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement