హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగులు, పెన్షనర్ల రెండు డీఏలకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
గట్టు ప్రాజెక్టు నిర్మాణానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందిరా సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. బాచారం హైలెవల్ కెనాల్ నిర‍్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
2జీ బార్లలో అడిషనల్ ప్రివిలేజ్ ఫీజు పెంచాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. వైన్ తయారీ కంపెనీల నుంచి వెయ్యి రూపాయల ఫీజు వసూలు చేసేందుకు సన్నాహాలు చేసుకోవాలని నిర్ణయం తీసకుంది. ఫారెన్ లిక్కర్ బేస్ ప్రైస్ కమిటీ 2023 రిపోర్టు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాలు
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు..
- 2024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు డీఏలకు కేబినెట్ ఆమోదం..
- ఎరియర్స్‌ను వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయం..
- డీఏలతో రాష్ట్ర ఖజానాపై 2,500 కోట్ల భారం..
- కరువు పరిస్థితులపై కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రాష్ట్రంలో 17 శాతం వర్షపాతం లోటు..
- 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు కేబినెట్ చర్చ.
- కరువుపై అఖిలపక్ష సమావేశం..
- కరువు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీ చర్చ..
- రైతు సంఘాలు, నిపుణులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం.
- కరువు సాయంపై కేంద్రానికి విజ్ఞప్తి
- కరువు మండలాలను ప్రకటించడంతో పాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ కేబినెట్..
- త్వరలో మంత్రుల బృందం ఢిల్లీ పర్యటన.
- 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు..
- ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల ఏర్పాటు..
- రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరిక..
- కోతలు లేకుండా విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి...
- 7,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు ఆమోదం..
- 3,000 మెగావాట్ల సోలార్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు.
- రంగారెడ్డి జిల్లా కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనులను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం..
- 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టుల నిలిపివేతకు ఆమోదం..
- దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై పునఃసమీక్ష..
- అసంపూర్తిగా ఉన్న 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు కేబినెట్ ఆమోదం..


