బీటెక్‌ విద్యార్థి సాయి తేజ మృతి కేసుపై NHRC సీరియస్ | Student Sai Teja case : NHRC Summons Telangana Higher Education Principal Secretary | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థి సాయి తేజ మృతి కేసుపై NHRC సీరియస్

Oct 1 2026 4:54 PM | Updated on Oct 1 2026 5:13 PM

Student Sai Teja case : NHRC Summons Telangana Higher Education Principal Secretary

సాక్షి,హైదరాబాద్: సీనియర్‌ విద్యార్థుల ర్యాంగింగ్‌కు బలైన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థి సాయి తేజ కేసుపై  జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమన్లు జారీ చేసింది.

ఈ ఘోర ఘటనపై గతంలో నివేదిక సమర్పించాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నివేదికను పంపకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 28న ఢిల్లీలోని  మానవ్ అధికార్ భవన్‌లో స్వయంగా కమిషన్ ముందు హాజరై, ఈ కేసులో తీసుకున్న చర్యలపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

గతేడాది సెప్టెంబర్‌ నెలలో హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థి సాయి తేజను సీనియర్ విద్యార్థులు తీవ్రంగా ర్యాగింగ్ చేస్తూ వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులు తాళలేక సాయి తేజ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ దారుణ ఘటనపై లా విద్యార్థి సభావట్ కళ్యాణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సాయి తేజ మృతి వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల్లో యాంటీ-ర్యాగింగ్’ నిబంధనలను పటిష్టంగా అమలు చేసి, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని తన ఫిర్యాదులో కోరారు. తాజాగా ఈ కేసు విచారణపై  తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమన్లు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement