హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఇప్పట్లో జారీ చేయబోమని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాంగ్రెస్ నేత పి.విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు నోటిఫికేషన్ ఇవ్వబోమని ఈసీ స్పష్టం చేసింది. దానం నాగేందర్ అనర్హతకు గురికావడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.
తన ఎన్నికల పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌కు సమాధానంగా ఈసీ తన వైఖరిని కోర్టుకు వెల్లడించింది. ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లబోమని తెలిపింది.
కాగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డి బరిలోకి దిగారు. ఆ సమయంలో దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ విజయారెడ్డి హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ అఫిడవిట్‌లో ఫారం-26కు సంబంధించిన వివరాలు పూర్తిగా పేర్కొనలేదని ఆమె చెప్పారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని అన్నారు.


