నీటి ప్రాజెక్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి
మంథనిరూరల్: నీటి ప్రాజెక్టుల రక్షణ బాధ్యత ప్ర భుత్వమే తీసుకోవాలని రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ కోరారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి మానేరులో కూలిపోయిన చెచెక్‌డ్యాంను సోమవారం జనవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్‌తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ ప్రయోజనాల కోసం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నా రు. అందుకు భిన్నంగా తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు ధ్వంసం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు వచ్చే సమయంలో డ్యాంలు, ప్రాజెక్టులు కూలిపోయే అవకాశం ఉంటుంద ని, కానీ, వరద ఉధృతి లేనిసమయంలో అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం కూలిపోయే అవకాశాలు ఉండవని అభిప్రాయపడ్డారు. చెక్‌డ్యాం కూలిపోయిన తీరును పరిశీలిస్తే ధ్వంసం చేసినట్లే తాము భావిస్తున్నామని అన్నారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందించి విచారణ కమిషన్ వేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ప్రజానిఘా వేదిక ప్రతినిధి వీవీ రావు, మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షుడు నోముల శ్రీనివాసరెడ్డి, వాక్ ఫర్ వాటర్ సంస్థ నిర్వాహకుడు కరుణాకర్‌రెడ్డి, జర్నలిస్ట్ సలీం తదితరులు పాల్గొన్నారు.


