హైదరాబాద్‌ను తలపించేలా అభివృద్ధి
● సుల్తానాబాద్ పట్టణంపై ప్రత్యేక దృష్టి ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి: హైదరాబాద్‌ను తలపించేలా సుల్తానాబాద్ పట్టణంలో రహదారులు నిర్మిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సుల్తానాబాద్‌పై సవతి ప్రేమ చూపారని ధ్వజమెత్తారు. గత ఎమ్మెల్యేలు ముకుందరెడ్డి, బిరుదు రాజమల్లు ఈప్రాంతానికి అనేక ప్రభుత్వ కార్యాలయాలు తీసుకొస్తే.. మనోహర్‌రెడ్డి వాటిని తరలించుకుపోయారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, అధికారులు రాజ్‌కుమార్, రవికుమార్, గుణశేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పడాల అజయ్‌గౌడ్, సింగల్‌విండో మాజీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌సాయిరి మహేందర్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం..
సుల్తానాబాద్‌రూరల్: విద్యాలయాల్లోని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గర్రెపల్లి, భూపతిపూర్ గురుకులాల్లో సొంతఖర్చులతో 17 గ్రీజర్లు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్, గిరిజ, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సర్పంచులు రమేశ్‌గౌడ్, చిన్నయ్య, నాయకులు అజయ్‌గౌడ్, జాని, సతీశ్, పన్నాల రాములు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనుమతులు వచ్చిన వెంటనే ప్రారంభం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం డిజైన్ ఫైనల్ చేసిందని, అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. మున్సిపల్ అధికారులతో ఈమేరకు సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్ తదితరులు పాల్గొన్నారు.


